ad here
780 Download
1 year ago
Independence Day Speech in Telugu PDF Free Download, తెలుగులో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం PDF Free Download.
ఆగస్టు 15వ తేదీన విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. వాటిలో ఒకటి ప్రసంగం. చాలా మంది ఇతర పిల్లల ముందు స్పీచ్ ఇవ్వడం నరకయాతన కలిగిస్తుంది. మనం దేని గురించి మాట్లాడాలి? ఎలా కమ్యూనికేట్ చేయాలో కొంత అనిశ్చితి ఉంది. ఫలితంగా, మనకు ఈ కథనం ఉంది. సమగ్ర స్పెసిఫిక్స్తో పాటు, మేము పిల్లలకు అన్ని వివరాలు, సిఫార్సులు మరియు ప్రసంగాన్ని ఎలా అందించాలనే దానిపై గణాంకాలను కూడా బోధిస్తాము.
ఆగస్ట్ 15, 1947న మన దేశం బానిసత్వం నుండి విముక్తి పొందింది. అప్పటి నుండి, మేము ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ సంఘటనల జ్ఞాపకార్థం ఆగస్టు 15వ తేదీని జాతీయ సెలవుదినంగా నిర్ణయించారు.
ఆగస్ట్ 15న ప్రసంగం ఒక అద్భుతమైన అవకాశం. ఇది స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని ప్రతిబింబించే మరియు గౌరవించటానికి ఒక అద్భుతమైన క్షణం. అందుకే పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో ప్రసంగ పోటీలు నిర్వహిస్తారు. మరి ఈ ప్రసంగం (స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం) ఎలా చేయాలి? ప్రసంగంలో నేను ఏమి చెప్పాలి? నేను మొత్తం ప్రసంగాన్ని ఎలా గుర్తు చేసుకోగలను? బోధకులు మరియు విద్యార్థుల ముందు నమ్మకంగా ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం.
ఇవాళ, రేపు మనకి ఆకలేస్తే జొమాటో లో ఆర్డర్ పెడితే గంటలో వచ్చేస్తుంది, అదే ఒక 10 సంవత్సరాల క్రితం అయితే మనం వండుకుంటే వండుకునే వాళ్ళం లేకపోతె హోటల్ కి వెళ్లి పార్సెల్ తెచ్చుకునే వాళ్ళము. మరి 1947 కు ముందు ? ఆరు నెలలు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన ధాన్యం నోటి వరకు కూడా కాదు ఇంటి గడప దగ్గరకు కూడా చేరేది కాదు. దానికి కారణం బ్రిటీషు వారి పాలన. ప్రపంచంలోనే ధనిక దేశాల్లో ఒకటిగా ఉండాల్సిన భారతదేశ సంపదను విచ్చలవిడిగా దోచుకుని భారతదేశాన్ని ఆర్థికంగా దెబ్బ తీశారు. మన దేశంలోనే మనల్ని బానిసలుగా చేసుకుని అరాచకం సాగించారు. బాల గంగాధర తిలక్ మొదటిసారిగా “స్వరాజ్య” వాదాన్ని వినిపించిన జాతీయవాది. తిలక్ భారతీయ సంస్కృతిని, చరిత్రను, విలువలను నిర్లక్ష్యం చేస్తూ, కించపరిచేదిగా ఉన్న బ్రిటిష్ విద్యావ్యవస్థను తీవ్రంగా నిరసించాడు. జాతీయ వాదులకు భావ ప్రకటనా స్వాతంత్ర్యం లేక పోవడాన్ని సహించలేకపోయాడు. సామాన్య భారతీయుడికి తమ దేశపు వ్యవహారాలలో ఏ విధమైన పాత్ర లేకపోవడాన్ని కూడా నిరసించాడు. వీటన్నిటినీ అధిగమించడానికి “స్వరాజ్యమే” సహజమైన, ఏకైక మార్గమని నమ్మాడు. “స్వరాజ్యం నా జన్మహక్కు” అనే అతను నినాదం భారతీయులందరికి స్ఫూర్తిదాయకమైంది. బ్రిటీషు వారిని మనదేశం నుండి తరిమి కొట్టడానికి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించడానికి మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, జవహర్ లాల్ నెహ్రు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకరు కాదు ఇద్దరు కాదు ఇలా ఎంతోమంది సమరయోధులు వారి ప్రాణాలకు సైతం తెగించి పోరాడారు. బ్రిటీషు వారిని ఎదిరించినందుకు ఎంతోమంది జైళ్లలో మగ్గిపోయారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఉప్పు సత్యగ్రహం, విదేశీ వస్త్ర బహిష్కరణ వంటి కార్యక్రమాలతో బ్రిటీషు వారిని ఎదిరించి పోరాడారు. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేఛ్చ , స్వాతంత్య్రం ఆ సమరయోధుల త్యాగ ఫలితమే. మనకి కనీసం పేరు కూడా తెలియని స్వాంతంత్య్ర సమరయోధులు ఇంకా ఎంతో మంది ఉన్నారు. కుటుంబం కంటే దేశమే ముఖ్యం అని దేశం కోసం ప్రాణాలు అర్పించి మనకు స్వాతంత్య్రం తెచ్చారు.
బ్రిటీషు వారు మన దేశం నుండి ఎంతో సంపదను దోచుకుని వెళ్లినా కూడా మన నాయకులు ఇచ్చిన స్పూర్తితో మనదేశం ఎదుగుతూ ఉంది. అయితే స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నా కూడా మనం కొన్ని జాడ్యాలను విడిచిపెట్టలేదు అని ఒప్పుకుని తీరాలి. అభివృద్ధి వైపు పరుగులు పెట్టాల్సిన మనం ఇంకా కులం, మతం , జాతి అని కొట్టుకుంటూ ఉన్నాం. ఎంత అభివృద్ధి జరిగితే అంత అవినీతి కూడా కనిపిస్తూనే ఉంది. దేశం మారాలి అంటే మనలో మార్పు రావాలి, ప్రతీ ఒక్కరిలోనూ. మన పని త్వరగా అవ్వాలి అని లంచం ఇచ్చే వ్యక్తులే రేపు ఏ పని చెయ్యడానికి అయినా లంచం తీసుకునే అందుకు వెనకాడరు. ఇలా మనం ప్రతీరోజూ చూస్తున్న చిన్న చిన్న వి అనుకుంటున్న తప్పులే మన దేశాన్ని ఇంకా ఇంకా వెనక్కి నెడుతున్నాయి. ఒక దేశం అభివృద్ధిలో పాలకులు ఎంత ముఖ్యమో ప్రజలు కూడా అంతే ముఖ్యం.
స్వాతంత్య్రం సాధించడం ఎంత ముఖ్యమో వచ్చిన స్వాతంత్య్రాన్ని సరిగా ఉపయోగించుకోవడం కూడా అంతే ముఖ్యం కదా. బ్రిటీషు వారు మనదేశాన్ని దోచుకుంటున్నారు అని వారిని తరిమికొట్టి మనదేశాన్ని మనమే దోచుకుని తింటుంటే ఎలా ఉంటుంది? ప్రతీ సంవత్సరం భారతదేశంలో చదువుకుని ఉద్యోగాలకు విదేశాలు వెళ్లే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. మరి వారి అందరికి మనదేశంలో ఉద్యోగాలు ఎందుకు కల్పించలేక పోతున్నాము? అభివృద్ధిలో దూసుకు పోతున్న దేశాలతో మనం ఎంతవరకు పోటీ పడుతున్నాం అని కూడా మనం ఆలోచించుకోవాలి. అలాగే మన చదువు కోసం ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్న ప్రబుత్వానికి దేశానికి మనం ఏం చేయగలుగుతున్నాం అని కూడా మనం ఆలోచించాలి.
మనం తినే ఒక్కో మెతుకు ఎంతో మంది త్యాగ ఫలితం అని గుర్తు ఉంచుకోవాలి. ఆగస్టు 15కి , జనవరి 26కి వారిని గుర్తు చేసుకోవడం కాదు మనం చేయాల్సిన పని. మన దేశాన్ని అభివృద్ధ్ది చేస్తూ ప్రపంచ దేశాల్లో మున్ముందుకు తీసుకుని వెళ్లడమే మనం వారికి ఇచ్చే ఘనమైన నివాళిగా భావించాలి. ఈ ఒక్కరోజే కాకుండా వారి పోరాట స్ఫూర్తి నిరంతరం మన గుండెల్లో ఉండాలి అని ఆకాంక్షిస్తూ
జైహింద్…
స్వామి వివేకానంద గారు ఒకసారి విదేశీ పర్యటనలో ఉండగా మీ దుస్తులు ఏంటి ఇలా ఉన్నాయి? ఇలా ఉంటె మిమ్మల్ని ఎలా గౌరవిస్తారు అని ఎవరో అడిగారు. దానికి సమాధానం ఇస్తూ ఆయన ఇలా అన్నారు అంట “ మీ దేశంలో మనుషులు వేసుకునే దుస్తులను బట్టి గౌరవం ఇస్తారు ఏమో కానీ మా దేశంలో వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవం ఇస్తారు అని అన్నారు “ ఇలా భారదేశంలో ఉన్న రాజుల మంచి తనాన్ని ఆసరాగా తీసుకున్న బ్రిటీషు వారు వ్యాపారం కోసం అంటూ దేశంలోకి ప్రవేశించి మనల్ని బానిసలుగా చేసుకుని దేశాన్ని 200 సంవత్సరాల పాటు మనల్ని పాలించారు. బ్రిటీషు వారి పాలనలో దేశ ప్రజలు అష్టకష్టాలు పడ్డారు, ప్రశ్నించిన వారిని నడి రోడ్డు మీదే రక్తం వచ్చేలా శిక్షించే వారు. దేశంలో కనిపించిన విలువైన సంపద అంతా దోచుకున్నారు. ఎదురుతిరిగితే భారాతీయుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడలేదు. అలాంటి సమయంలో ప్రాణం ముఖ్యమా ? దేశం ముఖ్యమా? అనే ప్రశ్న వచ్చినప్పుడు ప్రాణం కంటే దేశమే ముఖ్యం అంటూ స్వాతంత్య్ర ఉద్యమాన్ని మొదలు పెట్టిన మహానుభావుల వలనే మనకి ఈరోజు స్వాతంత్య్రం వచ్చింది. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి వారు ప్రాణాలు కూడా కోల్పోయారు.
హింసతో స్వాతంత్య్రం సాధ్యం కాదు అని మహాత్మా గాంధీ అహింస మార్గంలో ఉద్యమం ప్రారంభించారు, ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తువుల బహిష్కరణ, సహాయ నిరాకరణ కార్యక్రమాల ద్వారా బ్రిటీషు వారిని ఎదురించారు. సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లబాయ్ పటేల్, చంద్రశేఖర్ ఆజాద్, జవహర్ లాల్ నెహ్రు ఇలా ఎంతోమంది పోరాట ఫలితమే మన స్వాతంత్య్రం. మనం గుర్తించని స్వాతంత్ర సమరయోధులు ఇంకా ఎంతోమంది ఉన్నారు. వారిలో ఇప్పటికి చాలామంది వారి దేహాన్ని, ఈ దేశాన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటారు. మన కోసం మన స్వేచ్ఛ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడిన వారిని ఈ ఒక్క రోజు గుర్తు చేసుకోవడం కాదు, వారి పోరాట స్పూర్తితో మన దేశాన్ని మన స్వతంత్ర భరత మాతను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుందాం.
జైహింద్…
PDF Name: | Independence-Day-Speech-in-Telugu |
Author : | Live Pdf |
File Size : | 249 kB |
PDF View : | 38 Total |
Downloads : | 📥 Free Downloads |
Details : | Free PDF for Best High Quality Independence-Day-Speech-in-Telugu to Personalize Your Phone. |
File Info: | This Page PDF Free Download, View, Read Online And Download / Print This File File At PDFSeva.com |
PDF Name: | Independence-Day-Speech-in-Telugu-1 |
Author : | Live Pdf |
File Size : | 282 kB |
PDF View : | 39 Total |
Downloads : | 📥 Free Downloads |
Details : | Free PDF for Best High Quality Independence-Day-Speech-in-Telugu-1 to Personalize Your Phone. |
File Info: | This Page PDF Free Download, View, Read Online And Download / Print This File File At PDFSeva.com |
Copyright/DMCA: We DO NOT own any copyrights of this PDF File. This Independence Day Speech in Telugu PDF Free Download was either uploaded by our users @Live Pdf or it must be readily available on various places on public domains and in fair use format. as FREE download. Use For education proposal. If you want this Independence Day Speech in Telugu to be removed or if it is copyright infringement, do drop us an email at [email protected] and this will be taken down within 24 hours!
© PDFSeva.com : Official PDF Site : All rights reserved